నీటి వనరుల ఆక్రమణలను తొలగించాలి
1 min readజాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో నీటి వనరుల ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య ,నీటి వనరులు మరియు చెరువు భూముల జిల్లాస్థాయి పరిరక్షణ కమిటీ సభ్యులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నీటి వనరులు మరియు చెరువుల భూముల జిల్లాస్థాయి పరిరక్షణ కమిటీ తో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులు మరియు వాటి సమీపంలో ఎలాంటి ఆక్రమణ లు ఉన్నా, వాటిపై సర్వే చేసి పూర్తి వివరాలను ఈనెల 5 వ తారీఖు లోపల సమర్పించాలని కమిటీని ఆదేశించారు. అక్కడ నిర్మాణాలు తాత్కాలికముగా ఉన్నదా? పర్మినెంట్ గా ఉండేలా నిర్మించారా? అన్న విషయాలను సేకరించాలన్నారు. రెవెన్యూ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని పరిశీలించిన విషయాలను ఈనెల 5 వ తారీఖు లోపల రిపోర్ట్స్ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఆక్రమణల పై కూడా నివేదిక ఇవ్వాలని జేసీ అధికారులను ఆదేశించారు..నీటి వనరుల సమీపంలో బఫర్ జోన్ గుర్తించి ఆ ప్రాంతాల్లో స్టోన్ ప్లాంటేషన్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇలా చేయడం వల్ల భవిషత్తు లో ఆక్రమణలు జరగకుండా అరికట్టవచ్చునని కమిటీకి తెలియజేశారు. జిల్లాలోని పట్టణ ప్రాంతంలో పరిశీలించే సమయంలో ఆర్డిఓ,తహసిల్దార్లు,మునిసిపల్ కమిషనర్లు, జలవనరుల శాఖ అధికారులు, డీపీఓ సంబంధిత అధికారులందరూ సమన్వయంతో సర్వే నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డిపిఓ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.