ముగిసిన రెవెన్యూ గ్రామ సభలు..
1 min readదామగట్ల..అలగనూరు లో గ్రామసభ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ గ్రామ సభలు నిన్నటితో ముగిశాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో మంగళవారం గ్రామ సభ జరిగింది.ఈ గ్రామ సభలో నందికొట్కూరు తహసిల్దార్ బి శ్రీనివాసులు రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ రైతుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. భూములకు సంబంధించి అనేక రకాల పౌర సేవలతో పాటు ప్రభుత్వ పథకాలకు అవసరమైన పలురకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,డిప్యూటీ తహసిల్దార్ జి.సత్యనారాయణ,ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ కిషోర్ కుమార్,మండల సర్వేయర్ త్యాగరాజు,వీఆర్వోలు, నరసింహులు,వెంకటేశ్వర్లు,మనోహర్ గౌడ్,ఆనంద్, శ్రీనివాసులు ఉన్నారు. అదేవిధంగా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ పి.కృష్ణవేణమ్మ అధ్యక్షతన ఆర్ఐ జహంగీర్ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామ సభ జరిగింది.రైతుల సమస్యల గురించి 12 అర్జీలను ఆర్ఐ స్వీకరించారు. భూ సమస్యలను పరిష్కరించడానికి వీలైనంత త్వరగా కృషి చేస్తామని ఆర్ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో విఆర్ఓ రామయ్య,ఎండోమెంట్ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున శర్మ,గ్రామ సర్వేయర్ జయచంద్ర పాల్గొన్నారు.