ప్రముఖ ఈవెంట్ మేనేజుమెంట్ సంస్థ నగర ప్రవేశం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : భారదేశంలోని ప్రముఖ ఈవెంట్ మేనేజుమేంట్ సంస్థలలో ఒకటైన “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” హైదరాబాద్ నగరానికి తమ కార్యకలాపాలను విస్తరించినది. ఈవెంట్ సేవలను ఎలాటి అంతరాయం లేకుండా అందించుటలో పేరు గాంచిన కంపెనీ “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్”. ఇటీవల కాలంలో వివాహాల నిర్వహణ మరియు ఈవెంట్ పరిశ్రమలో పెరుగుతున్న ఆదరణతో హైదరాబాద్ లో పెరుగుతున్న ఈవెంట్ అవసరాలకు అనుగుణంగా తమ సేవలను అందించుటకు హైదరాబాద్ నగరానికి నేడు అధికారికంగా “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” విస్తరించినది. ఈనాడు హైదరాబాద్ లో పెరుగుతున్న ఈవెంట్ మార్కెట్ పనితీరును గుర్తించి దానిని సద్వినియోగం చేసుకునే దిశగా ఒక వ్యూహాత్మకంగా “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” హైదరాబాద్ నగరంలో అవిష్కరించటమైనది. “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” అత్యాధునిక విధానాలతో హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను మిళితం చేస్తూ అంకితభావంతో పనిచేసే స్థానిక సిబ్బందితో ఈవెంట్స్ (కార్యక్రమాలను) అందమైన అనుభావలను అందించు లక్ష్యంగా పనిచేయనున్నది. హైదరాబాద్ సంపన్న ఖాతాదారులకు కొదవలేదు వారి వ్యక్తిత్వాలకు అనుగుణంగా సంప్రదాయతలను పాటిస్తూ మరియు సమకాలిన ప్రభావాలను ప్రతిబింబించు విధంగా వేడుకలను నిర్వహించనున్నారు. “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” హైదరాబాద్ కార్యాలయం వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, కార్పోరేట్ ఈవెంట్స్ మరియు ఈ తరహా ఎన్నో కార్యక్రమాలకు తమ సేవలను అందించనున్నది. దేశ వ్యాప్తంగా నున్న తమ ఖాతాదారులకు నైపుణ్యవంతమైన మరియు అంకితభావం నిండిన అద్వితీయమైన సేవలు అందించుట ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలలో తమ ఉనికిని నెలకొల్పుతున్నాది. హైదరాబాద్ లో “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” సంస్థ ఆవిష్కరణ ఒక కీలకమైన మలుపు. హైదరాబాద్ నగరంలో “పార్టీ క్రూయిజర్స్ లిమిటెడ్” ఆవిష్కరణ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు జుజర్ లక్నోవాలా మరియు రచనా లక్నోవాలా మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి తమ సేవలను తీసుకు రావటం చాల సంతోషంగా ఉంది అన్నారు. తమ సంస్థ హైదరాబాద్ లో జరిగే గొప్ప వివాహాలు మరియు భారీ ఎత్తున నిర్వహించు వేడుకలకు త్వరలోనే కేంద్ర బిందువుగా మారుతుంది అన్నారు. మేము మా ఖాతాదారులకు వినూత్న రీతిలో, చక్కని అవగాహనతో ఎలాటి ఇబ్బందులు లేకుండా ప్రతి వేడుక ఆనందమయంగా సాగెలాగా తమ ఆలోచనలు మరియు సేవలు ఉంటాయి అన్నారు. త్వరలోనే బెంగుళూరు మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలకు తమ సేవలు విస్తరించనున్నట్లు చెప్పారు.