PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలుపోటములను సమానంగా భావించాలి..

1 min read

క్రీడాకారులకు కరాటే బెల్టులు అందజేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

  • పుట్టిన రోజు సందర్భంగా పిల్లలతో కలిసి కేక్​ కట్​ చేసిన ప్రముఖ వైద్యులు

కర్నూలు, పల్లెవెలుగు:జీవితంలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ఎలాంటి ఒడిదుడు కులనైనా ఎదుర్కొనే తత్వాన్ని క్రీడలు పెంపొందిస్తాయని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని భాష్యం పాఠశాలలో తన పుట్టినరోజు సందర్భంగా కరాటే క్రీడాకారులకు ఆయన బెల్టులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా భాష్యం పాఠశాలలో క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. భగవంతున్ని చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని, నిష్కల్మష హృదయమున్న చిన్నారుల కళ్ళల్లో భగవంతుని చూడవచ్చన్నారు.  ప్రతి ఒక్కరు సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

వృత్తి వైద్యం.. ప్రవృత్తి సేవ…

తాను వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ప్రవృత్తిగా మార్చుకుని ముందుకు సాగుతున్నానని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.  మొదట తాను చిన్న పిల్లల వైద్యుడిగా చిన్నారులకు సేవలు అందించానని, ప్రస్తుతం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా జీర్ణకోశ ,కాలేయ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల మానసిక ,శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఈ క్రీడలో సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు .ఇందులో ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో సరైన వ్యాయామం లేకపోవడం వల్ల జీవన శైలికి సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు, అధిక బరువు ,బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిలో వస్తున్నాయని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక వత్తిళ్లు తగ్గించుకొని ఆరోగ్యకరంగా జీవించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాలల జోనల్ ఇంచార్జ్ అనిల్ కుమార్ ,ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు మాధవిజ్ సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author