మాదకద్రవ్యాలు… సామాజిక రుగ్మతలపై వ్యాసరచన పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మాదకద్రవ్యాల వినియోగంతోపాటు ఇతర సామాజిక రుగ్మతలపట్ల యువతలో అవగాహన కల్పించడంలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీలో ఈరోజు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ తెలిపారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, అమరావతితోపాటు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీవారి సమన్వయంతో వర్సిటీ NSS విభాగంవారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. వ్యాసరచన, లఘుచిత్రాలు, ఇన్స్టాగ్రాంరీల్స్ మొదలైన విభాగాల్లో వర్సిటీతోపాటు, అనుబంధ కళాశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించాల్సిందిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీవారు వర్సిటీకి సమాచారమిచ్చారన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమరవాణా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్ మరియు బాల్యవివాహాల గురించి ఈ వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు దాన్ని అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వర్సిటీ NSS సమన్వయకర్త డాక్టర్ పి. నాగరాజు తెలిపారు. వర్సిటీ సైన్స్, ఆర్ట్స్, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులతోపాటు, నంద్యాల రామకృష్ణకాలేజి, సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి (ఆత్మకూరు రోడ్) కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. విజేతల వివరాలను త్వరలోనే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ వై. హరిప్రసాదరెడ్డితోపాటు వర్సిటీ NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.