పరిశ్రమల స్థాపన కు అనుమతుల మంజూరు లో జాప్యం చేయకూడదు
1 min readగడువు లోపు అనుమతులు మంజూరు చేయాలి
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పరిశ్రమల స్థాపన కు అనుమతుల మంజూరు లో జాప్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్,భూగర్భ జల శాఖ తదితర శాఖలకు సంబంధించి16 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటికి గడువు లోపు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే కి సంబంధించిన ఈ నెల 27 వ తేదీన స్పెషల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్ లకు, ఎంపిడిఓ లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ ఇన్చార్జి జిఎమ్ ను ఆదేశించారు… 28 వ తేదిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.. ఈ అంశం పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులకు స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ ఇన్చార్జి జిఎమ్ కి సూచించారు.రూ.2,85,80,357/-, విద్యుత్ ఖర్చు రీయింబర్స్మెంట్ క్రింద 01 క్లెయిమ్స్ కి సంబంధించి రూ.1,50,222/-, వడ్డీ రాయితీ రీయింబర్స్మెంట్ క్రింద 03 క్లెయిమ్స్ కి సంబంధించి రూ.10,19,167/- లు, సేల్స్ టాక్స్ రీయింబర్స్మెంట్ కింద 02 క్లెయిమ్స్ కి సంబంధించి రూ.51,22,195/- లు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు.జనరల్ క్రింద 06 , ఎస్సీ క్రింద 31, ఎస్టీ క్రింద 2, మొత్తంగా 39 క్లెయిమ్స్ కు ప్రోత్సాహకాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్చార్జి జిఎం అరుణ, ఎపిఐఐసి జిఎం శ్రీనివాసరెడ్డి , ఐలా ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్, కాలుష్య నియంత్రణ అధికారి , మత్స్యశాఖ అధికారి శ్యామల, ఏపీఎంఐపి పిడి ఉమాదేవి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.