అనాధ దహన సంస్కార ప్రక్రియలో కూడా… అవోపా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవోపా కర్నూలు వారి సేవా కార్యక్రమాలలో మరో ముందడుగుఇప్పటికే అనేక సేవా కార్యక్రమంలో అటు ఆర్యవైశ్యులకే కాక సమాజంలోని ఇతర వర్గాలకు కూడా సేవలు అందిస్తున్న అవోపా కర్నూలు ఈరోజు ఒక మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలియ చేస్తున్నాము.ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో చిదంబరావు వీధిలో నివసిస్తున్న శ్రీమతి వెంకటలక్ష్మి అనే ఆర్యవైశ్య గృహిణి చనిపోయిన విషయాన్ని ఆ ప్రాంతంలోని వారు అవోపా కు తెలియజేయగా వెంటనే అక్కడికి వెళ్లి ధహన సంస్కార ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. ఆమెకు బంధువులు గాని లేదా ఇతర ఎవరు లేకపోవటం ఉన్న కేవలము వారికి తెలిసిన ఒకరు ఇద్దరు మాత్రం ఉండటం మిగిలిన కార్యక్రమం అంతా కూడా అవోపా సభ్యులు పాల్గొని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా చీఫ్ convener ఎం. నాగేశ్వరరావు కోశాధికారి మేడ పురుషోత్తం సీనియర్ సభ్యులు పోలేపల్లి శేషయ్య గోనూరు యుగంధర్ శెట్టి పాల్గొన్నారు.