ప్రభుత్వాలు మారినా..రోడ్లు మారవా
1 min readరోడ్లపై ప్రయాణించాలంటే నరకమే
గుంతలు పూడ్చండి మహాప్రభో:సీపీఎం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నందికొట్కూరు నుండి నంద్యాలకు వెళ్లే రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు మారినా కానీ రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు,సిపిఎం నాయకులు పక్కిర్ సాహెబ్ అన్నారు.బుధవారం నందికొట్కూరు నుండి నంద్యాలకు వెళ్లే రహదారిని వారు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజూ వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై తిరుగుతున్నప్పటికీ గుంతలు పడి ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రభుత్వాలు మారినా రోడ్ల పరిస్థితి ఇంతేనా అని అన్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఇంకా పూర్తిగా దెబ్బతిని మరింత అద్వానంగా మారడంతో రోడ్డుపై ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మనమ్మతులు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.