రెవెన్యూ సదస్సుల్లో ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం ఇవ్వాలి
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో ఈనెల 6వతేదీ నుండి వచ్చే జనవరి 8వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతోందని, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, మండల స్పెషల్ ఆఫీసర్ లు,రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూసమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. జిల్లాలోని 672 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు.. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను రూపొందించామని, ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలిసేలా ఈ వివరాలను ప్రజలకు ముందుగానే తెలియచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ కో ఆర్డినేటర్ గా ఉంటారన్నారు..తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో, మండల సర్వేయర్, ఎండోమెంట్,వక్ఫ్ బోర్డు, రిజిస్ట్రేషన్,అటవీ శాఖలఅధికారులతో టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. వీరు గ్రామాలకు వెళ్లి సంబంధిత గ్రామానికి వెళ్లి ప్రజల నుండి అర్జీలను తీసుకుంటారన్నారు..అవసరమైన వాటికి ఫీల్డ్ లో వెరిఫై చేసి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు…మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్, నియోజక వర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తున్నామన్నారు.రెవెన్యూ సదస్సులు పెద్ద గ్రామాలైతే ఒకరోజు, చిన్న గ్రామాలైతే సగం రోజు నిర్వహించాలన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే సమయంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వెరిఫై చేసుకునేందుకు వీలుగా ఆర్ ఓ ఆర్, 1 బి, అడంగల్, వెబ్ ల్యాండ్ 1 బి, తదితర పాత రికార్డులను తీసుకొని వెళ్లాలన్నారు. ప్రతి గ్రామ సభలో 5 కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..సర్వీస్ లకు సంబంధించిన అప్లికేషన్ లను ఈ కౌంటర్లలో మీ సేవ ద్వారా ఉచితంగా నమోదు చేయాలన్నారు, సర్వే,మ్యూటేషన్స్ తదితర సేవలకు సంబంధించిన ఖాళీ అప్లికేషన్ లు సిద్ధంగా ఉంచుకుని అవసరమైన వారికి ఇవ్వాలన్నారు.. సదస్సుల్లో ప్రతి గ్రామానికి సంబంధించిన మ్యాప్ ను పెద్ద సైజులో పాటించాలన్నారు.. అందులో పట్టా భూమి, ప్రభుత్వ భూమి, అటవీ భూమి, వక్ఫ్ బోర్డ్ భూముల వివరాలను వివిధ రంగులలో రూపొందించి, గ్రామస్థులకు వివరించాలన్నారు . కొత్త RSR చదివి వినిపించాలన్నారు.ముందుగా రీ సర్వే జరగని గ్రామాల్లో సదస్సులను నిర్వహించాలన్నారు..రెవెన్యూ సదస్సుల్లో ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం ఇవ్వాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని కలెక్టర్ తెలిపారు.. మండల స్పెషల్ ఆఫీసర్లు మొక్కుబడిగా కాకుండా, సబ్జెక్టు ను అర్థం చేసుకుని ఫోకస్డ్ గా వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు.ఆర్డీవో లు రేపు డివిజన్ స్థాయిలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనేలా ప్రజలకు తెలియచేయాలని సూచించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్వో, వెంకట నారాయణమ్మ, మంత్రాలయం టిడిపి ఇన్చార్జి రాఘవేంద్ర, టిడిపి జనరల్ సెక్రటరీ ప్రసాద్, బీజేపీ పార్టీ ప్రతినిధి సాయి ప్రదీప్, రైతు సంఘం నాయకులు రామకృష్ణ , రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.