ప్రతి చెరువుకు నీరు నింపాలి ..మాజీ ఎంపీపీ తోప్పల శ్రీనివాసులు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం. డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్యాపిలి మండలంలో గల దాదాపు 18 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం మొదలుపెట్టారని మాజీ ఎంపీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో దాదాపు 12 చెరువులు పూర్తయినాయి. ఇంకా మిగిలి ఉన్న చెరువులకు. అనగా 1 గుడిపాటి చెరువు 2 నాయిని చెరువు 3 కలుచెట్ల చెరువు 4 పెద్ద పూజర్ల చెరువు 5 చండ్రపల్లి చెరువు. మొదలగు మిగిలి ఉన్న చెరువులకు నీళ్లు ఇవ్వాల్సిందిగా. ఎమ్మెల్యే ని కోరడమైనది. దానికి ఆయన స్కానుకూలంగా స్పందించి. త్వరలో పూర్తి చేస్తామని మాటిచ్చారు. రెండు మూడు నెలల్లో. ప్రతి చెరువుకు నీరు అందిస్తామని మాటిచ్చారు. ఇదే విషయమై మాజీ ఎంపీపీ అయినటువంటి తొప్పెల శ్రీనివాసులు చెరువుల చెరువు దగ్గరికి వెళ్లి సందర్శించడం జరిగింది. ఈ విషయమై.డిఈఈ శ్రీనివాస్ నాయక్ రామకృష్ణ ని కలిసి. ఐహెచ్పి కంపెనీని కోరడమైనది.వారు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మాటి ఇవ్వడం జరిగిందని ఆయన ఒక ప్రకటన తెలిపారు.