ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాస్ కావాలి
1 min readమెగా డీఎస్సీ నిర్వహణలో ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు
విద్యార్థులు డ్రాపౌట్ లు కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 62 శాతం మాత్రమే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ జిల్లా మన జిల్లా, ఈ పిల్లలు మన పిల్లలు అనుకొని ఉపాధ్యాయులు, ఎంఈఓ లు, హెడ్మాస్టర్లు పిల్లలందరూ ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ లో ఉత్తీర్ణతా శాతం బాగుందని, అలాగే జిల్లా పరిషత్, మునిసిపల్ హై స్కూల్స్ లో ఎందుకు తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని విశ్లేషణ చేసుకోవాలన్నారు..ప్రతి విద్యార్థి పాస్ కావాలని సవాల్ గా తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం మండలం, డివిజన్, జిల్లా వారీగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం మెగా డీఎస్సీ ద్వారా కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకం కానున్నందున ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని సూచించారు.. అప్పటివరకు ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ లో నియమించడం గాని,ట్యూటర్లను పెట్టడం గాని లేదా వర్చువల్ గా ఇక్కడి నుండే బోధన జరిగే విధంగా కానీచర్యలు తీసుకోవాలని డీఈవో శామ్యూల్ ను కలెక్టర్ ఆదేశించారు.మెగా డీఎస్సీ నిర్వహణలో ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదుమెగా డీఎస్సీ నిర్వహణలో ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదని, ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా 2645 పోస్టులను నోటిఫై చేయడం జరిగినందున, ఈ ప్రక్రియను ఎన్నికల నిర్వహణలాగా పకడ్బందీగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు డ్రాపౌట్ లు కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు..గత సంవత్సరం పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో రీఅడ్మిషన్ ఇచ్చి వారు ఉత్తీర్ణత అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు.కేజిబివి,రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, మోడల్ స్కూల్ లలో అడ్మిషన్ కావాలని మీకోసం, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలామంది దరఖాస్తులు ఇస్తున్నారన్నారు.. వీరందరికీ అడ్మిషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ కోఆర్డినేటర్, సంక్షేమ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు అందరూ సమావేశమై ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, ఏదో ఒక స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఒక్క విద్యార్థి కూడా పాఠశాల, వసతి గృహాల్లో సీటు దొరకలేదని బాధపడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..విద్యార్థులకు అందవలసిన కిట్లపై రివ్యూ చేస్తూ వచ్చిన కిట్స్ అన్ని విద్యార్థులకు అందజేయడం జరిగిందా అని అధికారులతో ఆరా తీశారు.. వారం లోపు విద్యార్థులందరికీ కిట్స్ పంపిణీ చేయాలని సూచించారు..కెజిబివి పాఠశాలల్లో విద్యార్థులకు అనువుగా వసతి గృహాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.విద్యాహక్కు చట్టం ద్వారా 25% పేద విద్యార్థులకు ఇచ్చే సీట్ల లో, 979 మంది ఇంకా చేరలేదని, వారు చేరనట్లయితే ఆ సీట్లలో మిగిలిన వారిని చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్, అసిస్టెంట్ డైరెక్టర్, పాల్ శామ్యూల్, సమగ్ర శిక్ష ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.