ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్
1 min readరానున్న నూరు రోజుల్లో అత్యంత పరిశుభ్ర జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం
మాసానికోక థీమ్ తో 12 మాసాలకు 12 నినాదాలతో కార్యక్రమ నిర్వహణకు చర్యలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కింద రానున్న వందరోజుల్లో అత్యంత పరిశుభ్ర జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ కార్యక్రమం పటిష్టవంతంగా అమలుచేసేందుకు ఆయా శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించాలన్నారు. ఏలూరు నగరంలో శనివారం పాత బస్టాండు ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివాస్ కార్యక్రమ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమీషనరును కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా శ్రమదానం, మానవహారం, ప్రతిజ్ఞ, ఆయా ప్రాంతాల్లోని పరిసరాలను పరిశుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ఈసమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమాల్లో స్ధానికులను, కళాశాల విద్యార్ధులను, వాకర్స్ అసోషియేషన్స్ లను, స్వచ్ఛంధ సంస్ధలను, ప్రజాప్రతినిధులను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని హాకర్స్, ఇతర ఆహార పదార్ధాల విక్రయాలకు సంబంధించిన షాపులను హెల్త్ ఇస్పెక్టర్లతో గుర్తించి వాటిలో ఆహార పదార్ధాలు హ్యండ్లింగ్ పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా షాపులకు ఒకటి నుంచి పది వరకు ర్యాంకులను ఇవ్వాలన్నారు. చెత్తతీసివేసిన కూడల్లో తిరిగి చెత్తవేసేందుకు వీలులేని విధంగా ఆపరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మార్కెట్, బస్టాండు, రైల్వేస్టేషన్ తదితర పరిసరాలు పరిశుభ్రతతో ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీలైన చోట్లా మొక్కలను నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, నగరపాలక కమీషనరు ఎ. భానుప్రతాప్, డిపివో కె. అనురాధ, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కెఎస్ఎంవి కృష్ణారావు, ఆర్ టిసి పిఆర్వో నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.