ధూమపాన రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
1 min read– లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎస్. వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్ధాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలను స్థానిక నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నిర్వహించారు .ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో పొగాకు ఉత్పత్తులపై అవగాహన కల్పించి, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్ధాలను సూచించే ప్రచార కరపత్రాలను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం లయన్స్ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులను వాడడం వల్ల గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల బారిన పడతారని, అంతేకాకుండా పొగాకు ఉత్పత్తుల వాడకం ఇతర శరీర అవయవాలపై కూడా పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను, సర్టిఫికెట్ లను అందజేశారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి, క్లబ్ సభ్యులు, యువతీ యువకులు పాల్గొన్నారు.