ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
1 min readతల సేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావలసిన ఆవశ్యకత ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని కర్నూల్ బ్లడ్ సెంటర్లో అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల సేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ డాక్టర్ రవికాంత్, అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మణిబాబు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తల సేమియా బాధిత చిన్నారుల కోసం అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. తల సేమియా బాధ్యత చిన్నారులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, వారి ఆవశ్యకతను గుర్తించి అక్షయ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమని చెప్పారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన చెప్పారు. రక్తదానం పై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని ఆయన సూచించారు. ఏ దేశానికైనా యువత మంచి సంపదని, అలాంటి యువత మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో అధికంగా ఉందని త్వరలోనే మన దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలోని మన దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని దీని కారణం యువ సంపద మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సెల్ఫోన్ లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారని , దీనివల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయని, తద్వారా బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడము శుభ పరిణామమని, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అక్షయ ఫౌండేషన్ను ఆయన మరోసారి అభినందించారు. సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. కర్నూల్ నగరంలో జరిగే సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.