ఎల్లమ్మ జాతర ప్రశాంతతకు అందరూ సహకరించాలి
1 min readశాంతి కమిటీ సమావేశంలో – సిఐ పార్థసారథి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఆదివారం జరుగుతున్న ఎల్లమ్మ జాతర ప్రశాంతతకు అందరూ సహకరించాలని సీఐ పార్థసారథి కోరారు, సోమవారం సాయంత్రం ఆయన చెన్నూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో చెన్నూరు గ్రామం లోని ఇరువర్గాల గ్రామ పెద్దలు శాంతి కమిటీ సభ్యులు తో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా సీఐ పార్థసారథి , మాట్లాడుతూ ఎల్లమ్మ జాతర సందర్భంగా ఊరేగింపులో ఎటువంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత శాంతి కమిటీ సభ్యుల పై ఉందన్నారు, మండల ప్రజలు జాతరను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఇది మన మండలం, మన గ్రామం, మనమందరం అన్నదమ్ములు అనే భావనతో ప్రతి ఒక్కరు ఉండాలని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆయన అన్నారు, చెన్నూరు గ్రామం, పాడిపంటలతో పశువుల సంపదలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే గ్రామమని, ఇలాంటి తరుణంలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా ఇందుకు సంబంధించి అందరి సహకారం ఉండాలని వారికి సూచించారు, జాతరలో పర్యవేక్షించడానికి డి.ఎస్.పి తో పాటు సీఐలు .ఎస్ ఐ లు. పోలీసులు బందోబస్తు గా ఉంటారని తెలియజేశారు, ఎల్లమ్మ దేవాలయం వద్ద కూడా అమ్మవారిని భక్తులు దర్శించేందుకు ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, శాంతి కమిటీ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు ముదిరెడ్డి సుబ్బారెడ్డి , అన్వర్ భాష, మునీర్ అహ్మద్, వారిస్, హస్రత్, జుమన్, షబ్బీర్ ఆకుల ప్రసాద్ బాబు. పలువురు శాంతి కమిటీ సభ్యులు హాజరయ్యారు.