ప్రతి ఒక్కరూ స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలలో భాగస్వామ్యాలు కావాలి
1 min readఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా కలెక్టర్ కె వెట్రీసెల్వి
మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ ప్రారంభం
పాత బస్టాండ్ వద్ద ప్రతిజ్ఞ, మానవహారం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ఎ భాను ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన మానవహారం,ప్రతిజ్ఞ అనంతరం జరిగిన సభలో పాల్గొని 15 రోజులపాటు జరిగేస్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు ప్రజలు అధికారులు భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించిన తదుపరి డివిజన్ ల కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది చీపుర్లుపట్టి స్వయంగా రోడ్లను ఉడ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి సత్యనారాయణ, డిఆర్డిఏ పిడి డాక్టర్ విజయరాజు, ఎంహెచ్ఓ డాక్టర్:మాలతి, మెప్మా పీడీ, డి.ఇ పిలగల కొండలరావు, తదితర అధికారులు మరియు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.