రహదారి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
1 min readఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: రహదారి ప్రమాదాలను నివారించడం ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) చెప్పారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగముగా గురువారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఇంచార్జి ఉప రవాణా కమిషనరు కె.ఎస్. ఎం.వి. కృష్ణారావు ఆధ్వర్యములో జిల్లా రవాణా శాఖ అధికారులు వాక్ దాన్ (Walkathon) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధా కృష్ణయ్య, దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్.పెదబాబు తదితరులు పాల్గొని విద్యార్థులతో పాటుగా రహదారి భద్రతా నియమాలను ప్రజలకు వివరిస్తూ జూట్ మిల్ కూడలి వరకు వాక్ దాన్ (Walkathon) కార్యక్రమము కొనసాగింది. దారిపొడవునా రహదారి భద్రతా నియమాలు వివరించే రవాణా శాఖ కరపత్రాలను ప్రజలకు అందించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపరాదని, రాష్ డ్రైవింగ్ వద్దని, ఇద్దరికి మించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించవద్దని మరియు ప్రమాదాల స్థాయిని తగ్గించడములో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, రవాణా అధికారులు కోరారు.ఈ కార్యక్రమములో రవాణా శాఖ పరిపాలన అధికారులు ఎం. రాము, ఎం. ఆనంద్ కుమార్, వాహన తనిఖీ అధికారులు ఎస్.బి.శేఖర్,ఎండి,విఠల్, అజ్మీరా బద్దు,ఎస్.జగదీష్ బాబు,నెహ్రు,జి.స్వామి, కళ్యాణి, ఏం.డి. జమీర్,పి.నరేంద్ర డి.ప్రజ్ఞ పాల్గొన్నారు. సాయి స్వర్ణ హీరో షోరూం మేనేజర్ సోమేశ్వరరావు సహాయ సహకారాలు అందించారు.