ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి..
1 min readనంది రెడ్డి సాయి రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు, విశ్వహిందూ పరిషత్
బజరంగ్ దళ్ .. దక్షిణ ఆంధ్ర కర్నూలు జిల్లా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి హిందూ ధర్మ విశిష్టతను తెలుసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి తెలిపారు. ఒక ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటుచేసిన బజరంగ్ దళ్ శౌర్య ప్రశిక్షణ వర్గ సమీక్ష సమావేశము లో పాల్గొన్న దాదాపు రెండు వందల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలకు విశ్వ హిందూ పరిషత్ కర్నూల్ నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు తల్లి నాగరత్నమ్మ చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి భగవద్గీతను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా నంది రెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ శివపురం నాగరాజు చేస్తున్న సేవలను కొనియాడుతూ ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలకు సహాయపడుతున్న శివపురం నాగరాజు సేవా బస్తీలలో గ్రామాలలో యువతకు భగవద్గీతను అందించి భగవద్గీత కంఠస్థ పోటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూల్ నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు మాట్లాడుతూ మా తండ్రి స్వర్గీయ శివపురం సత్యనారాయణ పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి భగవద్గీత ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తానని తెలియజేశారు.. ఈ సమీక్ష సమావేశంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాపరెడ్డి, రాష్ట్ర కో.కన్వీనర్ పోలేపల్లి సందీప్, విశ్వహిందూ పరిషత్ నాయకులు సందడి మహేశ్వర్, గోరంట్ల రమణ, ఈపూరి నాగరాజు, బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు శశి కుమార్, పెంచల్ రెడ్డి, రవికుమార్, పిచ్చయ్య చౌదరి, కమ్మయ్య, నీలి నరసింహ, ఈపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.