బాలికల రక్షణ, అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి
1 min readక్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ సాయి గోపాల్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాలికలు అక్షరాస్యులు అయినప్పుడే కుటుంబ ఆర్థిక పరిస్థితితోపాటు దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ సాయి గోపాల్ అన్నారు. 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో జరగబోయే వ్యాసరచన పోటీల గోడ పత్రికలను క్లస్టర్ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ డి.వి.ఆర్ సాయి గోపాల్ , అకాడమిక్ డీన్ వాయిజ్ మహమ్మద్ ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికల హక్కులు చట్టాలు అనే అంశంపై ఈ వ్యాసరచన పోటీలను 23 న ఉదయం 11 గంటలకు నైస్ కంప్యూటర్స్ కార్యాలయము నందు నిర్వహిస్తున్నామన్నారు.