PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50వేల మెజార్టీయ్యే  లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి..

1 min read

ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి

విజయవంతంగా పెదవేగి మండల వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం

రెట్టింపు ఉత్సాహంతో తరలివచ్చిన పార్టీ  శ్రేణులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : భారీ మెజారిటీతో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం రాట్నాలకుంటలోని మంగళవారం పెదవేగి మండల వైయస్సార్సీపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలో పెదవేగి మండలానికి అత్యధిక ప్రాధాన్యంతో సుమారు 630 కోట్లు అభివృద్ధి పనులు, 450 కోట్లతో జల్లెడ పట్టి మరీ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించి, ప్రతీ గ్రామ రూపురేఖాల్ని మార్చామని అన్నారు. వైయస్సార్సీపి పార్టీ చేసిన మంచిని రాబోయే 20 రోజుల్లో మీ గ్రామంలోని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మరోసారి గుర్తు చేయాలన్నారు. మన గెలుపు ఖాయమని, కనీసం 50 వేల మెజారిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. వైఎస్ఆర్సిపి తో నడిచిన పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మేమంతా సిద్ధం యాత్ర దెందులూరులో జగనన్నకు అపూర్వ స్వాగతం పలికిన దెందులూరు ప్రజలకు, వైయస్ఆర్సీపీ శ్రేణులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాయన కొఠారు రామచంద్రరావు, నియోజకవర్గ పరిశీలకులు, టీటీడీ బోర్డు మెంబర్ నెరుసు నాగసత్యం, జిల్లా వైయస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాద్, సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మెన్ పెనుమాల విజయ్ బాబు, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు జానంపేట బాబు, ఎంపీపీ  తాత రమ్య, విజయరాయి సొసైటీ అధ్యక్షులు పాలడుగు సత్యనారాయణ, కొప్పాక సొసైటీ అధ్యక్షులు చల్లగొళ్ల భూస్వామి, మేకా లక్ష్మణ్ రావు, గుత్తా ప్రసాద్ , మెట్లపల్లి సూరిబాబు, భాను, చంద్రమౌళి , ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author