రాంపురం జాతరకు సర్వం సిద్ధం
1 min read15న మహా రథోత్సవం
టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు వై. సీతారామి రెడ్డి , ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , వైకాపా నేత లు వై. ప్రదీప్ రెడ్డి , వై. ధరణి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
హాజరు కానున్న ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు.
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని రాంపురం గ్రామంలోని తుంగభద్ర నది తీరంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహా రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని ఆలయ ధర్మకర్తలు టిటిడి మాజీ పాలక మండలి సభ్యులు వై సీతారామి రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , వైకాపా నేత లు వై. ప్రదీప్ రెడ్డి , వై. ధరణి రెడ్డి ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ నెల 15వ తేది బుధవారం జరిగే మహా రథోత్సవం కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు అవుతారని తెలిపారు.
ఆలయ చరిత్ర :
ఆనాడు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ తుంగభద్ర నది తీరంలో పర్యటించారు. ప్రాంతకాల పూజ నిమిత్తం సైకత లింగాన్ని పూజలు గావించారు.. శ్రీ రాముడిచే ప్రతిష్టంచబడిన లింగమే రామలింగేశ్వరుడిగా అవతరించాడని ప్రతి ఏటా కనుమ రోజున రామలింగేశ్వరుడి జాతర, మహా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
అందరూ ఆహ్వానితులే: వై. బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే..
శ్రీ రామలింగేశ్వర స్వామి మా ఊరి దైవం. జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. రథయాత్రను పురస్కరించుకుని ఆలయానికి రంగులద్ది, విద్యుత్ దీపాలతో అలంకరణ చేశాం. ఉత్సవానికి అందరూ ఆహ్వానితులే. వేడుకలకు హాజరైన వారికి ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది… కావున ప్రతి ఒక్కరూ తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.