మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఎం. శ్రీనివాసరావు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశైలక్షేత్రంలో ఫిబ్రవరి 19న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈమేరకు దేవస్థానం భక్తుల సౌకర్యార్థం చేపడుతోన్న ప్రత్యేక ఏర్పాట్లను ఈవో ఎం. శ్రీనివాసరావు శుక్రవారం ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. పాతాళగంగ మెట్లమార్గం, స్నానఘాట్ల ప్రాంతాల్లో బారీకేడ్లు, విద్యుత్ సదుపాయం, మహిళలు దుస్తులు మార్చుకును గదులు, మరుగుదొడ్లు, బాతింగ్ షవర్స్ వంటి ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. అలాగే తలనీలాలు ఇచ్చే కళ్యాణ కట్ట ప్రాంగణం, వసతి సముదాయ… డార్మిటరీలను పరిశీలించారు. శివదీక్ష భక్తుల కోసం శివదీక్ష శిబిర ప్రాంగణంలో కల్పించాల్సిన తాత్కాలిక వసతి, ఇరుముడి సమర్పణ సదుపాయాలపై అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఏర్పాట్ల పరిశీలనలో.. ఈఈలు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, ఏఈవో మల్లికార్జునరెడ్డి, పీఆర్వో టి.శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్ కుమార్, ఇంజనీరింగ్, వసతి, పారిశుధ్య విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.