వివాదాస్పదంగా మారిన ఈవో వ్యాఖ్యలు. ..?
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానం ఈవో వ్యాఖ్యలు వివాదాస్పదంగా…? మారాయి. గురువారం మహానంది దేవస్థానం కార్యాలయంలో కార్తీక మాసం ఏర్పాట్లపై జరిగిన విలేకరుల సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పాటు దాతలను కించపరిచే విధంగా వ్యంగ్యంగా అవధాని, ప్రధాన అర్చకులు, కొంతమంది ఉద్యోగుల సమక్షంలో విలేకరులతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.. ఖరీఫ్ సీజన్లో వేసిన వరి పంట నవంబర్ మొదటి వారంలో కోతకు వచ్చే అవకాశం ఉందని మహానంది దేవస్థానంలో అమలవుతున్న నిత్య అన్న ప్రసాద వితరణకు సంబంధించి ధాన్యం సేకరించే అవకాశం ఏమైనా చేపట్టి అవకాశం ఉందా అని అడగగా…. ఛీ ఛీ మేము అడుక్కునే స్థితిలో లేమని గతంలో ఎవరో అడుక్కొని వచ్చి పెడితే అలా మేము అడుక్కొని రావాలా దాతల వారెవరో మాకు తెలియదు వివరాలు మీ దగ్గర ఉంటే చెప్పండి అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. మహానంది క్షేత్రం చుట్టూ ఐరన్ గ్రిల్ వేశారు దానికి కనీసం రంగులైన వేయలేదు కదా అని ప్రశ్నించగా ఎవరో చేసిన పనికి మేము ఎలా రంగులు వేస్తాము వారు వేయలేమని చెప్తే మేము ఏదైనా ఆలోచిస్తాం చేతనైంది రాసుకోండి. మహానది క్షేత్రంలోని నంది సర్కిల్లో ఏర్పాటు చేసిన నంది విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఎప్పుడు చేస్తారు అనగా అది కేవలం ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే దానికి ఏమిటి ప్రాధాన్యత ఉంది మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్నించారు. ఆలయం చుట్టూ మరియు పరిసర ప్రాంతాలు పిచ్చి మొక్కలు మొలచాయి కదా అని అనగా అవి మొలుస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయినా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహానంది దేవస్థానం లో ఉద్యోగాలు ఏవైనా ఖాళీలు ఉన్నాయా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. మీరు వారానికి 1 లేదా 2 రోజులు కొంతసేపు మాత్రమే కార్యాలయంలో ఉంటారని మిమ్ములను వారాల సారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారు తెలియడం లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది దీనిపై మీ వివరణ ఏమిటని ప్రశ్నించగా వాళ్ళు ఎలా అనుకుంటే నాకేమిటి అయినా కానీ గతంలో పని చేసిన వారికి నాకు తేడా చూపిస్తానని 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధిని కనపరుస్తానని ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి విలేకరులు మరియు అవధానులు అర్చకులు మధ్య పేర్కొన్నారు. ఇప్పుడు ఒక లెక్క ఇప్పటినుండి మరో లెక్క అన్న చందనంగా వ్యవహార శైలి ఉంటుందేమోనని గుసగుసలు వినవస్తున్నాయి .