మాజీ మంత్రి బుగ్గన నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి: తోప్పేల శ్రీనివాసులు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మాజీ ఎంపీపీ తోప్పేల శ్రీనివాసులు, తెదేపా నాయకులు గొల్ల రామ్మోహన్, బంకు నాగేంద్ర, కృష్ణమోహన్ ఖాజా ఫీర్ అన్నారు.ఈ సందర్భంగా ప్యాపిలి పట్టణంలోని నవీన్ సప్లయర్స్ యందు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేఈ, కోట్ల కుటుంబాలు అభివృద్ధి అంటే వారికి దక్కుతుంది, ఇప్పుడు వచ్చి పది సంవత్సరాలు కాలేదు అప్పుడే అప్పుడే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పై అసత్య వాక్యాలను చేయడం సమజయం కాదని , ప్యాపిలి మండల పరిధిలోని పోతుదోడ్డి గ్రామంలో కంకర క్రషర్ ఫ్యాక్టరీ వలన రైతులు పొలాల్లో దుమ్ము పడుతుందని గ్రామస్తులు నారాయణ, పుల్లారెడ్డి గ్రామస్తులు ఫ్యాక్టరీ బంద్ చేయాలని అడిగినందుకు వారిపై గ్రామంలోని చిచ్చుపెట్టి కోడేళ్ళతో ,కట్టలతో దాడి చేపిచ్చిన వారు మీరు కాదా. అలాగే ప్యాపిలి పట్టణంలో బీసీ కాలనీలో తెదేపా కార్యకర్తలని వైసీపీ కి చెందిన వారు టిడిపి వర్గీలపై ఘర్షణ చేసి హాస్పిటల్ పాలు చేసి గాయపడిన వారు ప్రాణస్థితిలో ఉన్నారు. ఈ దుర్మార్గం చర్యలు తమరు కాదా చేసింది. పదేళ్ల నాటి నుంచి ఎలాంటి కక్షలు ఘర్షణలు తావు లేదంటివి ఇప్పుడు ఓడిపోయావని ఓర్వలేక మా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పై ఆపనిందలు చేస్తున్నారు, ప్రజల కోసం వారి సేవ చేసేవారే కాని కీడు మాత్రం తలపెట్టారని, అలాగే అభివృద్ధి పనులకు వారు ముందు ఉండి చేపిస్తారు. అభివృద్ధి పనులకు వారు అడ్డుపడరు, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని కాంట్రాక్టర్లని పిలిపించి నాణ్యత గురించి అడిగామె తప్ప అభివృద్ధి పనులను నిలిపివేయాలని మా ఎమ్మెల్యే కు ఏ కోశానా లేదని వారు తెలిపారు. డోన్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకొచ్చారంటే కె. ఈ,కోట్ల వారి కుటుంబాలకే సాధ్యమని మిగతా వారికి ఎవరికి అర్హత లేదని వారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఏ ప్రభుత్వంలో అవినీతులు జరిగాయి, దాడులు జరిగాయి, అనే వాటిపై అన్ని గమనిస్తున్నారని అది తెలుసుకోని, నిజా నిజాలు మాట్లాడాలి,తెలియకపోతే రండి బహిరంగ సభకు మేము రెడీ మీరు సిద్ధమేనా మాజీ మంత్రి బుగ్గన కు వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మౌలాలి రెడ్డి, సంజీవరెడ్డి, కోదండరామయ్య, బ్యాంకు శీను, మల్లి తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.