PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీప్లేన్ విధాన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని… ఇందులో భాగంగానే సీప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. మంగళవారం శ్రీశైలంలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో పాటు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్,  జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ లతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా పాతాళ గంగ వద్ద బోటింగ్ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మీడియా విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ కృష్ణా నది పున్నమి ఘాట్ నుంచి విజయవాడ – శ్రీశైలం మధ్య  సీప్లేన్ ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారన్నారు. విజయవాడలో ప్రారంభమైన సీప్లేన్ నల్గొండ టన్నెల్ వద్ద ల్యాండ్ అయి పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్ద ప్లాస్టిక్ జెట్ కు చేరుకొని రోప్ వే ద్వారా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శిస్తారన్నారు. ఇందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, గ్రీన్ రూమ్, విఐపి ల సీటింగ్ అరేంజ్మెంట్ తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.అంతకుముందు రోప్ వే ఎంట్రీ పాయింట్ వెలుపల ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి ఎల్ 1, గ్రీన్ రూమ్ ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే  త్రాగునీటి వసతి, పార్కింగ్, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాట్లకు కూడా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సూచించారు. దేవస్థాన పరిధిలో ముఖ్యమంత్రి ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీలు దేవస్థాన ఈఓతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ జెట్ ను పరిశీలించారు. ల్యాడర్ కు డెకరేషన్ చేయాలన్నారు. రోప్ వే భవనం, క్యాబిన్, నడకదారుల్లో ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టి పెయింటింగ్ వేసి ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు. ఏర్పాట్లలో తేడా వస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రోప్ వే పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ, దేవస్థాన అధికారులను కలెక్టర్  ఆదేశించారు. ప్లాస్టిక్ జెట్ ఏర్పాటుతో పాటు ల్యాడర్ కు డెకరేషన్, రోప్ వే భవనం, క్యాబిన్, నడకదారుల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి పెయింటింగ్ వేసి ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు.

About Author