PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ కన్వెన్షన్ హాల్లో 22 వరకు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఎక్సిబిషన్

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: బందర్ రోడ్ లోని ఏ కన్వెన్షన్ నందు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ ను మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా సిల్క్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగినదని చెప్పారు. నిర్వాహకులు ఎర్రం శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో మొట్ట మొదటిసారిగా  14 రాష్ట్రాల నుంచి వివిధ రకాల మాన్యువల్ సిల్క్ హ్యాండ్లూమ్ సిల్క్ బెనారస్ చందేరి కాంచీపురం బెంగాలీ క్రేప్ ఉప్పాడ జిందల్స్ కూటంపల్లి ఇక్కట్ శారీస్ గద్వాల్ నారాయణపేట్ వెస్ట్ బెంగాల్ ఎంబ్రాయిడింగ్ సారీస్ వివర్స్ వచ్చి సరసమైన ధరలలోనే అందించడం జరుగుతుందనిచెప్పారు. హ్యాండ్లూమ్ సిల్క్ కలిగి ఉన్న సారీస్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయని అలాగే బెనారస్ దొరుకుతాయని మరియు బేవర్స్ కూడా 20% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు.ఈ ప్రదర్శన ఈనెల 22, వరకు జరుగుతుందని కావున ఈ అవకాశాన్ని  విజయవాడ నగర  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About Author