PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దోపిడీలు భూదందాల..జగన్ నైజం

1 min read

చట్టాలను చుట్టాలుగా చేసుకున్న జగన్

ఒక్క నెలలోనే ఐదు సంతకాలు చేసిన ఘనత మాదే

ఎమ్మెల్యే జయసూర్య..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ రాష్ట్రంలో భూ దందాలు దోపిడీలు ఇలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పై పండిపడ్డారు.గురువారం మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో చట్టాలను చుట్టాలుగా మార్చుకున్నాడని చిత్తూరులో 722 ఎకరాలు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో భూములు కొట్టేశారని తిరుపతి రేణిగుంట మఠం తదితర భూములు కబ్జా చేయాలని చూశారని రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూమిలో ప్యాలస్ ల మాదిరిగా కట్టించారని వైసీపీ నాయకుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఋషి కొండలో 5 వందల కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టించాడని ఎమ్మెల్యే అన్నారు.జగన్ రాష్ట్రంలో ఏ విధంగా భూ దందా చేశాడో ప్రజలందరూ గమనించాలన్నారు.జగన్ అధికారాన్ని దోచుకోవడం దాచుకోవడమే తప్పా రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఐదింటికి సంతకాలు ముఖ్యమంత్రి చేశారని నేను చాలా గర్వపడుతున్నా ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత ప్రజలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,పలుచాని మహేశ్వర్ రెడ్డి,లాయర్ జాకీర్,జమీల్, ముర్తుజావలి,కాటేపోగు నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author