PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంటి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించాలి..

1 min read

అంధత్వం వంటి తీవ్ర సమస్య రాకుండా కాపాడుకోవచ్చు…

రోజా వీధిలో జరిగిన ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో

సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రతి ఒక్కరూ కంటి సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొంగితే కంటి చూపు కోల్పోవడం (అంధత్వం) వంటి తీవ్ర సమస్యలకు గురి కాకుండా ఉండవచ్చని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని రోజా వీధిలో సీనియర్ వీడియో జర్నలిస్ట్ రామస్వామి ఆధ్వర్యంలో సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ సుధాకర్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి సంబంధించి కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాల అధినేత డాక్టర్ సుధాకర్ రావు, సీనియర్ వీడియో జర్నలిస్టు రామస్వామి, సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనిషి శరీరంలోని అన్ని అవయవాలలో కళ్ళు అతి ముఖ్యమైనవని చెప్పారు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న నానుడి వెలువడిందని వివరించారు. ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడల్లా కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. రోజా వీధిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం అభినందనీయమని తెలిపారు. సుశీల నేత్రాలయ అధినేత, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు తో తనకు 32 సంవత్సరాలుగా అనుబంధం ఉందని ,ఆయన రాయలసీమలోని పేరొందిన కంటి వైద్య నిపుణులు అని వివరించారు. లక్ష మందికి పైగా ఆయన కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉంటారని, మరో వెయ్యి ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలలో కంటి వైద్యులు మాత్రమే పూర్తిస్థాయిలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. కర్నూల్ నగరంలో సుశీల నేత్రాలయ అధినేత ప్రముఖ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు సహకారంతో మరిన్ని కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కంటికి సంబంధించిన సమస్యలు ఒక్కసారిగా సీరియస్ అయితే చికిత్స నిర్వహించడం కష్టతరమని ఇలాంటి పరిస్థితి రాకుండా కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందాలని సూచించారు. కర్నూల్ నగరంలో తన వంతుగా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందజేస్తున్నానని ఆయన తెలిపారు.అనంతరం సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్  సుధాకర్ రావు మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. డాక్టర్ శంకర్ శర్మతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పేదలకు వైద్య సేవలు అందించడంతోపాటు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం, దుప్పట్లు పంపిణీ చేయడం, క్రీడాకారులకు సహకారం అందించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారని తెలిపారు .నిరంతరం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్ శంకర్ శర్మ స్ఫూర్తిదాయకమని వివరించారు .రోజా వీధి లాంటి పేదల నివసించే ప్రాంతంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఇలాంటి వైద్య శిబిరాల వల్ల నిరుపేదలు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా వృద్ధులలో కంటి సమస్యలు అధికంగా వస్తాయని అయితే వారికి వైద్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం వహించడం తగదని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ప్రాథమిక దశలోని వాటిని గుర్తించి నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ద్వారా అంధత్వం వంటి సమస్య రాకుండా ఉండవచ్చు అని చెప్పారు. భవిష్యత్తులో పేద ప్రజల కోసం మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

About Author