విద్యార్థులకు కంటి పరీక్షలు: కంటి డాక్టర్ షేక్షావలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు శుక్రవారం నిర్వహించారు. స్కూల్ హెల్త్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు నెలల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జగద్గురు మఠం దగ్గర ఉన్న ఉర్దూ బాలికల స్కూల్లో చదువుతున్న మొత్తం 260 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు కంటి డాక్టర్ షేక్షావలి తెలిపారు. అందులో 15 మంది విద్యార్థులకుకంటి పరీక్షల్లో అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు, మందులు సరఫరా చేస్తామని, అలాగే, పిల్లల్లో ప్రాధమికంగా విటమిన్ ఎ లోపం, మెల్ల కన్ను, పుట్టుకతో వచ్చిన కంటి సమస్యలు వంటివి ఈ పరీక్షల్లో నిర్ధారిస్తామని కంటి వైద్య నిపుణులు డాక్టర్ షేక్షావలి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు కంటి వైద్యులు పాల్గొన్నారు.