బ్రాహ్మణ స్త్రీలను దూషించిన ఫైలాదాస్ ను అరెస్టు చేయాలి…
1 min readహిందూ ధార్మిక సంఘాలు…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బ్రాహ్మణ స్త్రీలను వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడిన పైలాదాస్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం 11:30 గం.లకు కే.సీ.కెలాల్ ప్రక్కన గల వినాయక స్వామి ఆలయం,వినాయక ఘాట్ నుండి బ్రాహ్మణులు, హిందూ ధార్మిక, సామిజిక సంస్థలు ర్యాలీ గా బయలూదేరి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ నిరసనలో లలితా పీఠం పీఠాధిపతి గురుమేడా సుబ్రహ్మణ్యం(సుబ్బి స్వామి)మాట్లాడుతూ….16 సం. బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి లోకాఃసమస్తా సుఖినో భవన్తు అని లోకంలో ఉన్న జీవ,జంతుజాలాలు సుఖంగా ఉండాలని కోరే బ్రాహ్మణ స్త్రీలను నీచమైన పదజాలంతో దూషించిన ఫైలాదాస్ ను వెంఠనే అరెస్టు చేయాలని పిలుపునిచ్చారు, విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ అశేష హిందూ సమాజానికి హిందూ సనాతన ధర్మాన్ని బోధిస్తూ ,గురు స్థానంలో నిలిచిన బ్రాహ్మణులను ఏవిధంగానైనా విడదీయాలన్న తలంపుతో విధర్మియులు, నాస్థికులూ చేస్తున్న కుట్రలో భాగంగానే ఫైలాదాస్ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడు తున్నారనీ,హిందూ దేవి దేవతలను అదేపనిగా దూషోస్థూ, కించపరచడం వీరికి అలవాటనీ, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేశారు, బ్రాహ్మణ సంఘాల నాయకులు ABBM రాష్ట్ర కో ఆర్డినేటర్ జిల్లా అర్చక పురోహిత కన్వీనర్ దేవళ్ళ వసంత సాయినాథశర్మ, బ్రాహ్మణ మిత్ర మండలి అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్, కర్నూలు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కళ్ళె చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో ఎన్ని కష్ట,నష్టాలెదురైనా సనాతన ధర్మాన్ని పాటిస్తూ…ఆదాయం ఉన్నా లేకున్నా ఎవ్వరినీ చేయిచాచకుండా థీమ్ జీవనాన్ని గడుపుతున్న బ్రాహ్మణులంటే సమాజంలో చాలా తక్కువ భావనను ఏర్పరచడానికి సోషల్ మీడియా ఆధారంగా కొందరు బ్రాహ్మణ ద్వేషులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనీ,అందుకే అభం,శుభం తెలియని బ్రాహ్మణ స్త్రీలను వ్యక్తిగతంగా దూషించిన ఫైలాదాస్ లాంటి వారిపై ” బ్రాహ్మణ అట్రాసిటీ” చట్టాన్ని అమలు చేయాలని తద్వారా బ్రాహ్మణులను కించపరిచేలా వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు కఠినంగా అమలు చేస్తూ ఫైలాదాస్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సదరు ఫైలాదాస్ కు “పింఢ ప్రధానం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ తూంకుంట ప్రతాప రెడ్డి, రాష్ట్ర కోషాధికారి సందడి మహేశ్వర్, జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, జిల్లా సహకార్యదర్శులు గూడూరు గిరీబాబు,ఈ పూరి నాగరాజు, గోవిందరాజులు, కర్నూలు నగరం ABBM,సెక్రటరీ కే,నరేష్, బ్రాహ్మణ RBS,స్టేట్ సహ కార్యదర్శి శ్రీనివాసరావు, యం.రాజేష్.శివసుబ్రహ్మణ్యశర్మ. నరేష్.ప్రవీణశర్మ. వినోద్శర్మ,ABBM.కార్యకర్తలు, జాతీయ ఎస్టీ కమిటి సభ్యులు రామచంద్ర నాయక్,మా.జా.పా నాయకులు సందడి సుధాకర్,బజరంగ్ దళ్ కార్యకర్తలు భగీరథ, సాయిరామ్, రక్షిత్,ప్రఖంఢ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్చార్జి కలెక్టర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్యకి ఫైలాదాస్ కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం ఇస్తున్న బ్రాహ్మణ సంఘం నాయకులు.