పీఎం తండాలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్
1 min readపల్లెవెలుగుయ వెబ్ పత్తికొండ : పత్తికొండ మండలం పీఎం తాండ గ్రామంలో శుక్రవారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. డాక్టర్ అరుణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోగులకు వివిధ పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సూచన మేరకు సక్రమంగా మందులు వాడి మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. రోజు తప్పనిసరి వ్యాయామం, ఆహారపు అలవాట్లు పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఎం. ఎల్ .హెచ్. పి. లలిత, ఏఎన్ఎంలు పాల్గొని రోగులకు సేవలందించారు.