నాగటూరు..కొణిదెల గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు, కొణిదెల గ్రామాల్లో నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావల్లి ఆధ్వర్యంలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’అనే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు మరియు ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు.ఏఓ మరియు సిబ్బంది. మొక్కజొన్న పంట పొలాల కు వెళ్లి కాండంతో పురుగు నివారణకు సస్య రక్షణ పద్ధతులు వాటి గురించి రైతులకు వివరించారు.సస్యరక్షణ కాండం తొలుచు పురుగు నివారణ చర్యల గురించి,పిల్ల పురుగులు ఆకులపై పత్ర హరితాన్ని గోకి తింటుంది ఆ తర్వాత కాండం లోపలికి చేరుతుందని ఆకులపై వరుస క్రమంలో పొడవాటి చిల్లులు కనిపిస్తాయి నివారణకు క్లోరెంట్రినిప్రోల్ 18.5% SP @60 మీ.లి/ఎకారని పిచికారి చేయాలి ఎక్కువ ఉన్నప్పుడు కార్బోఫిరాన్ 3g@ 3 కిలోలు ఎకరానికి పైరు మొలకెత్తిన 25 నుంచి 30 రోజులకు ఆకుల సుడులలో వేయాలని రైతులకు సూచించారు.అదే విధంగా కత్తెర పురుగుమొదటి దశ గొంగళి పురుగు ఆకులపై పత్ర హరితాన్ని గోకితింటూ ఆకులపై రంద్రాలు చేస్తుంది ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్టుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినివేయుట గమనించ వచ్చని ఆకు సుడులను మరియు కాండాన్ని కూడా తొలిచి రంధ్రాలు చేసి పంటను నష్ట పరుస్తుంది కంకి మరియు లేత కండలను కూడా నష్టపరుస్తుందని ఏవో అన్నారు.