పొలం పిలుస్తోంది కార్యక్రమం…
1 min readరైతులు గ్రూపులుగా ఏర్పడి కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎస్ ఎస్ వి సుభాషిని
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రైతులు వరితోపాటు టమాట ఇతర కూరగాయలు, పండ్ల తోటలు వంటివి సాగు చేసుకుని అధిక ఆదాయం పొందాలని, రైతులు గ్రూపులుగా ఏర్పడి కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి యశస్వి సుభాషిని తెలిపారు. బుధవారం ఆమె మండలం లోని కనపర్తి, అలాగే చెన్నూరు-3, రైతు భరోసా కేంద్రాల పరిధి లలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్ ఎస్ వి సుభాషిని రైతులతో మాట్లాడుతూ, రైతులు వరి తో పాటు టమాట ఇతర కూరగాయలు, పండ్ల తోటలు వంటివి సాగు చేసి అధిక ఆదాయం పొందాలని తెలిపారు. అదే విధంగా రైతులు గ్రూపులుగా ఏర్పడి కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చన్నారు. మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి మాట్లాడుతూ, రైతులు పై పాటుగా కాంప్లెక్స్ ఎరువులు( పాస్పెట్) వాడకూడదని వీటిని దుక్కిలో మాత్రమే వాడాలని తెలిపారు. యూరియా, పొటాష్ ఎరువులు వంటి సూటి ఎరువులను మాత్రమే పై పాటుగా వేసుకోవాలని తెలియజేశారు. హార్టికల్చర్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ, 20 ఏళ్లు మించిన మామిడి తోటలను కత్తిరింపులు, (టాపింగ్) చేసుకునే రైతులకు రూ, 15వేల వరకు నగదు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. డ్రిప్ ఇరిగేషన్ అధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 90 శాతం రాయితీతో డ్రిప్ పెట్టుకొని పసుపు వంటి పంటలలో తక్కువ నీటి ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మా అగ్రికల్చర్ అసిస్టెంట్ మహమ్మద్ రఫీ, డి. చరణ్ కుమార్ రెడ్డి , యు. సృజన, రైతులు పాల్గొన్నారు.