అప్పుల బాధతో రైతు దంపతులు ఆత్మహత్య
1 min readఆత్మహత్య చేసుకున్న మహేష్ రెడ్డి (40) భార్య శాంతి (35) దంపతులు :
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : వెలుగోడు మండల పరిధిలోని అబ్దులాపురం గ్రామంలో పొలంలో రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. బుధవారం వెలుగోడు ఎస్ఐ భూపాలుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతులు ఉదారు మహేష్ రెడ్డి (40) భార్య శాంతి (35) అప్పుల బాధతో మంగళ వారం అర్థరాత్రి దాటిన తరువాత పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా ఆత్మహత్య చేసుకున్న మహేష్ రెడ్డి భార్య శాంతి దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడని అతని పేరు నిఖిల్ రెడ్డి అని అన్నారు. నిఖిల్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఆస్తికి మించిన అప్పులు చేశారని అన్నారు. ఆ అప్పులు చెల్లించ లేక ఇలా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
వెలుగోడు – అబ్దులాపురం గ్రామ ప్రజల ప్రకారం వివరాలు ఇలా వున్నాయి :
వెలుగోడు గ్రామానికి చెందిన చండ్ర వెంకటేశ్వర్ రెడ్డి అనే రైతు తన కూతురు శాంతికి అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఉదారు మహేష్ రెడ్డి అనే వ్యక్తితో గత 30 ఏళ్ళ క్రితం ఇచ్చి పెళ్లి చేశారని తెలిపారు. వీరికి ఒక మగ సంతానం నిఖిల్ రెడ్డి వున్నాడని అన్నారు. అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఉదారు మహేష్ రెడ్డి తన భార్య శాంతితో కలిసి వెలుగోడు లోని వరుసకు మామా అయినా చండ్ర వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లోనే గత కొనేళ్లుగా కాపురం ఉంటున్నట్లు సమాచారం. మృతి చెందడానికి ఒక రోజు ముందు కూడా తన మామ ఇంటి నుండి వచ్చి పురుగుల మందు తాగి చనిపోయాడని అంతేగాని అబ్దులాపురంలో నివాసం ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు.