అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
1 min readపత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పత్తికొండ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతందాన్ని తీవ్ర నష్టాలకు గురి చసిందని అన్నారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల లోని పలు గ్రామాలలో అధిక వర్షాలకు టమోటా,ఉల్లిగడ్డ,సజ్జ, వేరుశనగ, పత్తి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారాణి తెలిపారు ఎకరా. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు 20,000 చొప్పున ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు తీవ్రంగా నష్టపోయారని తక్షణమే పంటనష్ట అంచనా వేసి ప్రతి రైతుకు పరిహారo అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో పత్తికొండ ఎంపీపీ,మండల దాసు, వైసీపీ నాయకులు శ్రీరంగడు, సోమశేఖర్, బాబులు రెడ్డి, కారం నాగరాజు, పత్తికొండ,తుగ్గలి మండలాల సర్పంచులు,వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.