ఫేంగల్ తుఫాన్ పై రైతులు అప్రమత్తంగా ఉండాలి
1 min readజిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాష
అకాల వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి
వివరాలు తెలియజేసిన వ్యవసాయ అధికారి యం ప్రియాంక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ భాషా అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల అమ్మపాలెం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి యం ప్రియాంకతో కలిసి ఆయన పర్యటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రైతులు వరి పంట కోతను వాయిదా వేసుకోవాలని, అదేవిధంగా కోసిన వరి పంటను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించడం గాని, కుప్పలు వేయడం గాని, కుప్పలు వేయడం గాని చేయాలన్నారు. అవసరమైన వారికి టార్బలెన్స్ అందజేస్తామని తెలిపారు. రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండలం వ్యవసాయ అధికారి ఎం ప్రియాంక, వి.ఏ.ఏ లు ధనరాజ్, శ్రీకాంత్ రైతులు తదితరులు పాల్గొన్నారు.