PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి

1 min read

పి. రామచంద్రయ్య డిమాండ్.                     

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  దేశానికి అన్నంపెట్టే అన్నదాతగా వున్న రైతన్న పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆంద్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర   అధ్యక్షుడు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయం చదువుల రామయ్య భవన్ లో రైతన్న డైరీని ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ,  రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆయన కోరారు. మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుండడం పై దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారనీ తెలిపారు. రైతు నాయకుడు దలేవల్ రైతుల పక్షణా వివిధ డిమాండ్ల సాధన కోసం గత నవంబర్ 26 నుంచి పంజాబ్ – హర్యానా మధ్య ఖనౌరి సరిహద్దు వద్ద  నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని, అయితే ఆయన ఆరోగ్యం క్షిణించడం తో  ఆసుపత్రికి తరలించారని దాంతో దిగొచ్చిన ప్రభుత్వం నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్రం వీలైనంత త్వరగా చర్చలు జరుపుతామని హామీఇచ్చారని అన్నారు.రైతు ఉద్యమ ఫలితంగా  రైతులతో ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి రైతు సంఘాల ఐక్య ఉద్యమాలే మార్గదర్శకాలని అన్నారు. దేశవ్యాప్త రైతులు సైతం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు పి. భీమలింగప్ప, సీపీఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, కౌలు దారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. తిమ్మయ్య, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఎం. కారన్న, రైతు సంఘం మద్దికెర మండల అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *