రైతులకు విత్తనాలు..బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా రైతులకు 90 శాతం సబ్సిడీతో ఎరువులు విత్తనాలు ఇవ్వాలని అలాగే బ్యాంకుల్లో ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో విత్తనాలు సరఫరా చేయడం లేదన్నారు. వర్షాలు ముందుగా రావడంతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి సరిగ్గా ఈ సమయంలో విత్తనాల సమస్య తలెత్తిందన్నారు.నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంత్రివర్గ కూర్పులపై కొత్తగా గెలుపొందిన టిడిపి ఎమ్మెల్యేలు బిజీగా ఉండి రైతులను పట్టించుకోవడం లేదని సీజన్ గడిచిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి రైతులకు మొక్కజొన్న పత్తి, మినుములు,మిరప,ఉల్లి విత్తనాలు ఎరువులు అందించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పక్కిర్ సాహెబ్, నాగన్న,రాజు,నాగస్వామి, తిరుపతయ్య,మధు పాల్గొన్నారు.