రైతులు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని చిన్నమాచుపల్లి, నర్సారెడ్డి పల్లె గ్రామాల్లోని రైతులకు భూసార పరీక్షలు ఎలా నిర్వహించుకోవాలో, పంటలకు సంబంధించి ఏ ఏ మందులు, ఏ ఏ ఎరువులు ఎప్పుడు వాడాలో వంటి విషయంపై బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరిగింది, . ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు వై శంకర్ నాయక్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతులు భూసార పరీక్ష ఆధారిత ఎరువులు వాడుకోవాలని ముఖ్యంగా సూటి ఎరువులైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ట్ ఎరువులను దుక్కిలో వేసుకోవాలని తెలియజేశారు. అలాగే యూరియా పొటాషి ఎరువులను మాత్రమే పై పాటుగా వేయాలని పాస్ఫేట్ ఎరువులను పైపాటిగా వేయరాదని తెలియజేశారు. వరిలో కాండం తోలుచుపురుగు నివారణకు గుళికలను రెండు మూడు సార్లు వేస్తున్నారని అలా చేయడం వలన భూమిలో సమతుల్యం నశిస్తుందని కాబట్టి అవసరమైనప్పుడు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అని తెలియజేశారు. వరిలో కంకినల్లి వంటివి గమనించి ప్రిఫెనోఫోస్ రెండు మిలి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలియజేశారు .రబి సీజన్ పంట నమోదు ఈ పంట చేసుకోవాలని తెలియజేశారు. నానో యూరియా మరియు నానో డి ఏ పి వాడుకొని రసాయన ఎరువుల వాడకం తగించాలని తెలియజేశారు.రబి సీజన్ నుండి పంట నమోదు చేసుకొని ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులు చెల్లించుకోవలసినదిగా తెలియజేశారు. మినుము నువ్వులు మొదలగు పంటలకు డిసెంబర్ 15 లోపల వరికి డిసెంబర్ 31 లోగా చెల్లించాలని ఆయన రైతులకు సూచించారు .మండలంలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి వారికి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి, వ్యవసాయ విస్తరణ అధికారి ఇందిరా, గ్రామ వ్యవసాయ సలహాయకులు రెడ్డి బాషా ,సి.టి.కమలి,రెడ్డి నాగేశ్వరి,చరణ్ కుమార్ రెడ్డి, యు సునీల్, మహమ్మద్ రఫీ ,,,ప్రకృతి వ్యవసాయ వెంకటయ్య ,చిన్న నరసింహులు పాల్గొన్నారు.