PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం సారథ్యంలో రైతులు అధైర్య పడవద్దు..

1 min read

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు) : రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మహిళా మండలి పొదుపు సమాఖ్య ప్రాంగణంలో నాఫెడ్ వారి ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ వారి కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర 7,550 రూ.లు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో మార్కెట్లో ధర పెరిగితే అదే ధరలకు రైతుల వద్ద నుండి కొంటారని అదేవిధంగా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. మార్క్ ఫెడ్ డీఎం హరినాద్ రెడ్డి మాట్లాడుతూ రోజుకు రైతులు 40 క్వింటాళ్ల  వరకు కందులను కొంటామని ఇంకా మీ దగ్గర పంట ఉంటే మరుసటి రోజున కేంద్రాల కొంటామని కందుల తేమ శాతం 12 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని రైతులు ఎన్ని ఎకరాలు అయినా సరే కంది పంటను సాగు చేసి ఉంటే ఆ సరుకును అంతా కేంద్రాల ద్వారా కొంటామని డీఎం అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఏడిఏ విజయ శేఖర్,ఎంపీడీఓ దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,గ్రామ సర్పంచ్ జయలక్ష్మమ్మ,ఎంఏఓ పీరు నాయక్ నాయకులు జయరాముడు,సర్వోత్తమ్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి, ప్రమోద్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,నాగేంద్రుడు,గోకారి,చాకర్ వలి,సోఫి సాహెబ్,నరసింహ గౌడ్,సహకార సొసైటీ సీఈవో మల్లికార్జున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *