భూ సమస్యలను గ్రామ సదస్సులు ద్వారా రైతులు పరిష్కరించుకోవాలి
1 min readఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్, రీ సర్వే తదితర సమస్యల పరిష్కారానికి వేదిక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: పెదవేగి గ్రామాలలో రైతులు దీర్ఘ కాలంగా ఎదుర్కుంటున్న భూ సమస్యలను రెవిన్యూ గ్రామ సదస్సుల ద్వారా పరిష్కరించు కావాలని దెందులూరు ఎమ్ ఎల్ ఏ చింతమ నేని ప్రభాకర్ అన్నారు,ఈ సదస్సుల లో పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ సమస్యలు,సర్వే ,రీ సర్వే ,భూతగాదాలు,భూ ఆక్రమణలు,పుంత దారులు,డొంక దారులు,గ్రామ కంఠాలు , బండి పుంతలు ఆక్రమణల వంటి సమస్యల పరిష్కారాన్ని కి ఈ సదస్సు లు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలని ఏం ఎల్ ఏ అన్నారు,రైతులు ఈ సదస్సుల ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మండలాల వారీగా నిర్వహిస్తున్న రెవిన్యూ గ్రామ సదస్సు లు ఏలూరు జిల్లా పెదవేగి మండలం కె కన్నా పురం ,చక్రాయగూడెం గ్రామాలలో ప్రారంభ మయ్యాయి,ఈ రెవిన్యూ గ్రామ సదస్సులకు దెందులూరు ఎమ్ ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు,గ్రామాలలో రైతులు తమ సమస్యలనురెవిన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు,వాటి పై వెంటనే స్పందించి పెదవేగి తహశీల్దార్ నేతృత్వం లో రెవిన్యూ అధికారులు సత్వర పరిష్కారాలు చూపాలని ఎమ్ ఎల్ ఏ చింతమనేని ఇన్చార్జి తహశీల్దార్ భ్రమరాంబ ను ఆదేశించారు,ఈ సదస్సులకు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ తమ భూ సంబంధిత సమస్యలను అర్జీల ద్వారా తెలుపుకున్నారు,ఈ సదస్సులో మండల సర్వేయర్ మూర్తి,ఇన్చార్జి ఆర్ ఐ కె ఐ పి సారథి,వీ ఆర్ వో లు పాల్గొన్నారు,ఈసదస్సులు డిసెంబర్ 11వ తేదీ నుండి జనవరి 8వ తెదేవరకు జరుగుతాయని ఇన్ చార్జీ తహశీల్దార్ భ్రమరాంబ తెలిపారు.