PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి… పి. రామచంద్రయ్య

1 min read

భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న. సిపిఐ.ఏపీ రైతు సంఘం నాయకులు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఏపీ రైతు సంఘం నాయకులు చిన్నహుల్తి, జూటూరు గ్రామాల సమీపంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొర కురిసిన వర్షాలకు రైతులు వేరుశనగ, పత్తి, కంది, మిరప, టమోట, ఉల్లి, సజ్జ, జొన్న పంటలు సాగు చేశారని, నెలన్నర నుండి వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు  పొర్లి పొంగడంతో పంట పొలాల్లో భారీ వర్షాలకు పంటలన్ని మునిగిపోయి  సాగుచేసిన పంటలన్నీ నీట మునిగిపోయి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని, రెవెన్యూ,వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కు పంట పెట్టుబడికి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు. రబీ సీజన్ లో పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి. రాజా సాహెబ్, నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద ఈరన్న, గౌరవ అధ్యక్షులు కారన్న, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాస్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి రంగన్న పాల్గొన్నారు.

About Author