ఫాతిమా షేక్ సేవలు మరువలేనివి…
1 min readప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిలా ఉపాధ్యాయురాలిగా పేరుగాంచిన ఫాతిమా షేక్ 194వ జయంతి ఘనంగా నిర్వహించారు. మొదట పాఠశాల హెచ్ఎం భ్రమరాంబ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఫాతిమా షేక్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ మాట్లాడుతూ, ఫాతిమా షేక్ సేవలు మరువలేనివి అన్నారు.భారతీయ విద్యావేత్త సంఘసంస్కర్తలైన జ్యోతిరావు పూలే ,సావిత్రిబాయి పూలేల తో కలిసి పని చేశారని ఆమె తెలిపారు. ఫాతిమా షేక్ దళిత పిల్లలకు విద్యను అందించడం అదేవిధంగా అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యతను చేపట్టారు. బాలిక స్త్రీవిద్యకు అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఫాతిమా ఒక సామాజిక ఉద్యమకారిణి అన్నారు .నేటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.