ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
1 min readతల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలి.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ ప్రతినిధి ఎమ్మిగనూరు : పట్టణంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎమ్మిగనూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని,మరియు తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలని డిమాండ్ చేస్తూఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్థానిక వైయస్సార్ సర్కిల్ వరకు కాళీ ప్లేట్లు చేతుల్లో పట్టుకొని రోడ్డుపైన ఉన్నటువంటి ప్రతి షాపుల్లో బిక్షాటన చేస్తూ అనంతరం వైయస్సార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు విజేంద్ర హాజరై అనంతరం వారు మాట్లాడుతూ ఇవ్వగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఎన్డీఏ కూటమి ప్రాంతం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని, వారు డిమాండ్ చేశారు, అధికారంలోకి రాకముందు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ప్రతి సభల్లో మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లివందనం కింద 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు మేం అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపు పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా తెరపైకి తీసుకో రాకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు, బూటకపు హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టినటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి అలాగే తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో మీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘముగా ప్రత్యక్షంగా అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధమవుతాం చెప్పి ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు,అబ్దుల్ ఖాదర్, రంగస్వామి వీరేష్,మోహన్, సమీర్, సురేష్, మహేష్, రవి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.