PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజేశ్వరి లాంటి వీర మహిళలు మరికొంతమంది రావాలి  : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జనసేన వీర మహిళ రాజేశ్వరి లాంటి మహిళా నాయకురాలు ఆదోని పట్టణంలో మరింత మంది ముందుకు రావాలని ఎమ్మెల్యే పార్థసారధి కోరారు.జనసేనా వీరమహిళ రాజేశ్వరి ఆదోని నుండి జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి దాకా సైకిల్ యాత్ర చేసినటువంటి వీర మహిళను  ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజేశ్వరి కార్యకర్తగా, మహిళా నాయకురాలుగా ఎలక్షన్ల సమయం ముందు నుంచి కూడా ఎన్డీఏ కూటమి గెలవాలని ఆమె చేసిన సేవలను అంత ఇంత కాదని ఎమ్మెల్యే పార్థసారథి.  ఏదేమైనాప్పటికీ జనసేన వీర మహిళ రాజేశ్వరి చేసిన ఘనతకు ముమ్మాటికి ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిందే అని అన్నారు.రాజేశ్వరి కుటుంబానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా ఒక అన్నల తోడుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.

About Author