ఉపాధి హామీ పథకం ద్వారా రు.300 వేతనం పొందే లాగా ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలి
1 min readఫీల్డ్ అసిస్టెంట్లు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వి. ఆర్.కృష్ణ తేజ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులు అర్హులైన ప్రతివారు పొందేలాగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ క్షేత్రసహాయకులు కృషిచేయాలని పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వి.ఆర్. కృష్ణతేజ తెలిపారు. గురువారం స్ధానిక క్రాంతి కళ్యాణమండపంలో జిల్లాస్ధాయి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ క్షేత్రసహాయకుల శిక్షణా కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా గ్రామాల్లో చేపట్టే ఉపాధిపనులకు అర్హులైన ప్రతి వారికి పనికల్పించే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పధకాన్ని క్షేత్ర సహాయకుల పనులు గ్రామంలో ఎంతగానో ప్రాముఖ్యతను సంచరించుకుంటుందని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్రణాళిక ప్రకారంగా పనులు చేపట్టాలి అన్నారు. ఒకే రోజు రాష్ట్రంలో 13 వేల 326 గ్రామ పంచాయితీల పరిధిలో గ్రామ సభల ద్వారా పనులను గుర్తించడం ప్రపంచంలోనే రికార్డ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెపండుగ ద్వారా రూ. 4,500 కోట్లుతో 3,500 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు, బిటి రోడ్లు, మరమ్మతులను చేపట్టడం జరిగిందని అన్నారు . రాష్ట్రంలో మూడు నెలలలో12500 గోకులాలను పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ఏలూరు జిల్లాలో ఉపాధిహామీ పనుల నివేదిక ప్రకారం మట్టిపనిచేసే ఎన్ఆర్ఇజిఎస్ కూలీలు పొందుతున్నవేతనం వివరాలను తెలుసుకొని మరింత ఎక్కువ వేతనం పొందేల జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ద్వారా అవగాహన పెంచుకొని పనులు చేపట్టడం లో మంచి ఫలితాలను పొందడానికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి కూలీకి రూ. 300 లు వేతనం పొందే లాగా ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టే ఫిష్ పాండ్, అమృత్ సరోవర్, ఛానల్స్, కెనాల్ లైన్ ప్లాంటేషన్, గోకులం, ఫార్మా ఫాంట్స్, కందకాలు, బెంచ్ టెర్రసింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లుగా మీరు అందించే సేవలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఈ శిక్షణా తరగతుల ద్వారా ఉపాధిహామీ పనులకు సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని ఉత్సాహంతో గ్రామాల్లో ఉపాధిహామీ పనులు విరివిగా చేపట్టి కూలీలకు రూ. 300 లు వేతనం అందేలాగా కృషిచేయాలని పేర్కొన్నారు.శిక్షణ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుల విధులు బాధ్యతలు, జాబ్ కార్డ్ ముఖ్య సూచనలు, పనికి దరఖాస్తు, శ్రమశక్తి సంఘాల ఏర్పాటు, జాతీయ చరవాణి పర్యవేక్షణ వ్యవస్థ, మస్టర్ నిర్వహణ, డిమాండ్కు తగ్గట్టు అనుసరించవలసిన వ్యూహం, కందకాలు పీటర్ కాలువలు చెరువు కట్టల పునరుద్ధరణ పనుల వివరణ నమోదు రిజిస్టర్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.సమావేశంలో ఈజీఎస్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ వైవి షణ్ముఖ కుమార్, ఎడిషనల్ కమిషనర్ పంచాయతీరాజ్ మల్లెల శివప్రసాద్, ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్ (డ్వామ) కె వెంకట సుబ్బారావు, జడ్పీ సీఈవో సుబ్బారావు, డిఆర్డిఏ పిడి డాక్టర్:విజయరాజు, డిపిఓ కె . అనురాధ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఏ పురుషోత్తమరావు, డి దామోదర్ రావు, పి శ్రీదేవి, జిల్లాలోని ఎంజి ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.