ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కి క్షేత్ర స్థాయి శిక్షణ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం బయనపల్లి గ్రామంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి క్షేత్ర స్థాయి లో వివిధ పద్ధతుల గురించిడిపిఎం శ్రీ ఏస్ వి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి శ్రీమతి శ్రీదేవి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం తొ మంచి ఆరోగ్యం మరియు ఆహారం పండించుకొని ఖర్చులు తగ్గించుకోవాలి అని తెలియచేశారు. ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా అంతరపంటలు తో అధిక దిగుబడులు సాధించవచ్చును .పాల్గొన్న వారు డిపిఏంశ్రీ ఏస్ వి ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి శ్రీదేవి వి వి ఏశ్రీ సాయి మరియు అడిషనల్ డిపిఎంఎస్ఎంటి వసంత కుమారి, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిపాల్గొన్నారు.