యాభై ఏండ్ల పి.డి.ఎస్.యు విద్యార్థి ఉద్యమం చారిత్రాత్మకం
1 min readగోడపత్రికలు ఆవిష్కరణ….
పీ.డీ.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు..
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: యాభై యెల్ల పీ.డీ.ఎస్.యూ విద్యార్థి ఉద్యమం చారిత్రాత్మకం అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు అన్నారు.మంగళవారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు మాట్లాడుతూఅక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో, నవంబర్ 5న విజయవాడలో జరిపే 50 ఏండ్ల పీ.డీ.ఎస్.యూ అర్థ శతాబ్దోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.1975లో జరిగిన రమేజాబి ఘటనపై పి.డి.ఎస్. యు ఉద్యమించిన ఫలితంగానే మహిళలను అరెస్టు చేస్తే సాయంత్రం 6 గంటల్లోపు విడుదల చేయాలనే చట్టం వచ్చిందన్నారు. పి.డి.ఎస్.యు విద్య కార్పొరేటీకరణ కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. గతంలో క్యాపిటేషన్, మేనేజ్మెంట్ ఫీజులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ద్వారా ప్రభుత్వాలే కూలిపోయాయి అన్నారు.పి.డి.ఎస్.యు నాయకులను ఉత్పత్తి చేసే కేంద్రంగా ఉందని ఈ సంస్థలో పనిచేసిన నాయకులు అనేక ప్రజా సంఘాల్లో వారి పూర్తి సమయాన్ని ఉద్యమం కోసం పనిచేస్తున్నారన్నారు. బలమైన ఉద్యమాలే ప్రజల హక్కులను కాపాడతాయని ఉద్యమాల నిర్మించేందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. కామ్రేడ్ జార్జీరెడ్డి,జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి, కోల శంకర్, స్నేహలత, మారోజు వీరన్న లాంటి అమరవీరుల స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆశించారు. అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీలో, నవంబర్ 5న విజయవాడలో జరిగే సభలను విజయవంతం కావాలని సభ స్ఫూర్తితో శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం, సమ సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి నరసింహ రెడ్డి,సహాయ కార్యదర్శి గోవర్ధన్ ,నాయకులు మునిస్వామి, బాలికల కళాశాల విద్యార్థినిలు అఖిల, రాణి, మహాలక్ష్మి, టీనా, చందు తదితరులు పాల్గొన్నారు.