PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:   మండలంలోని రామనపల్లి , హరిజనవడకు చెందిన లింగంపల్లి సుబ్బారాయుడు వయసు 46 సంవత్సరాలు అనారోగ్యానికి గురియై ఆదివారం మృతి చెందడం జరిగింది, ఈ విషయాన్ని స్థానికులు అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు తంగెళ్ల గురయ్య, బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి మృతుడు లింగంపల్లి సుబ్బరాయుడుకు పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతుని దహన సంస్కారాల కొరకు 2000 రూపాయలను అందజేయడం జరిగింది, అదేవిధంగా మృతిని మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా అందుబాటులో ఉంటామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవ సమితి సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author