మృతి చెందిన సరోజమ్మ కూతురు పద్మావతి కి ఆర్థిక సహాయం
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు ఆగస్టు 15 న్యూస్ వెలుగోడు పట్టణ మేజర్ గ్రామపంచాయతీ లో పారిశుద్ధ కార్మికురాలుగా విధులను నిర్వహిస్తూ మృతి చెందిన సరోజమ్మ కూతురు పద్మావతికి గ్రామపంచాయతీ పార్ట్ టైం ఉద్యోగులు ,సర్పంచ్ వేల్పుల జైపాల్ ,ఈవో హరిలీల అందరూ కలిసి తమ వంతు ఆర్థిక సహాయంగా 50 వేల రూపాయల నగదును అందించారు. అనంతరం జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ వేల్పుల జయపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జైపాల్ మాట్లాడుతూ తమ సిబ్బందికి ఎటువంటి కష్టమొచ్చిన, ఇబ్బంది కలిగిన తామున్నామంటూ సహచర ఉద్యోగులు, ఈవో హరిలీల, తాను ముందుండి ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. ఈ ఆర్థిక సహాయంతో మృతురాలి కుటుంబానికి ఎంతోకొంత ఆసరా అవుతుందన్నారు. కార్మిక నాయకుడు గాదె రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి సర్పంచ్ వేల్పుల జైపాల్ తమ కార్మికులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. సర్పంచ్ , ఈవో ల సూచనల మేరకే మా కార్మికులంతా మా చేతనయినంత ఆర్థిక సాయంతో పాటు, సర్పంచ్ మరియు ఈవో హరిలీలల ఆర్థిక సాయంత తో కలిపి 50 వేల రూపాయలను మృతుల కుటుంబాలకు అందించడం తమ అందరికీ సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ఆర్థిక సహాయం పరంపరను ఎల్లవేళలా కొనసాగేలా అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు చికెన్ బాబు, ఎంపిటిసి రాజేష్ కుమార్, కార్యాలయ సిబ్బంది ,కార్మికులు పాల్గొన్నారు.